Archive for the ‘నక్సలిజం’ Category

మావోయిస్టులు ప్రజా రాజ్యం పార్టీని అపార్ధం చేసుకున్నారు.

Wednesday, September 3rd, 2008

మావోయిస్టుల ప్రకటనపై ప్రజా రాజ్యం పార్టీ అధికార ప్రతినిధులైన డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ ఈ విధంగా స్పందించారు, “మావోయిస్టులు మమ్మల్ని అపార్ధం చేసుకున్నారు. నక్సలిజంపై చిరంజీవికి స్పస్టమైన అవగహన ఉంది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. సామజిక, ఆర్ధిక సమస్య అన్నది ప్రజా రాజ్యం పార్టీ విధానం. చిరంజీవి మాటలని మీడియా తప్పుగా ప్రచరం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ‘నలుగురు నక్సలైట్లను చంపినంత మాత్రాన  ఈ సమస్య పరిష్కారం కాదు.’ అన్న చిరింజీవి అభిప్రాయాన్ని ‘నలుగురు మనుష్యులను చంపినంత మాత్రాన  ఈ సమస్య పరిష్కారం కాదు.’ అని తప్పుగా ప్రచారం జరిగింది. పార్టీ విధానాలను త్వరలో పుస్తకం రూపంలో వెలువరిస్తాము”